![]() |
![]() |

ఢీ డాన్స్ షో ఎన్నో ఏళ్ళ నుంచి అలరిస్తూ ఇప్పటి వరకు 16 సీజన్స్ ని పూర్తిచేసుకుంది.. ఇక ఇప్పుడు ఢీ సీజన్ 17 సెలబ్రిటీ స్పెషల్ పేరుతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ షో కమింగ్ సూన్ ప్రోమోని రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇన్ని సీజన్స్ గా మనం ఢీ షోలో సుధీర్, ప్రదీప్ యాంకరింగ్ చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఈ సీజన్ ప్రోమోలో మాత్రం నటుడు నందు కనిపించి సీజన్ అవుట్ లైన్ చెప్పాడు. "డాన్స్ అంటే నాకు ప్రాణం ప్రతీ ఒక్కరి జీవితంలో డాన్స్ ఉంటుంది.
డాన్స్ ఉన్న ప్రతీ ఒక్కరిలో ఢీ ఉంటుంది." అంటూ ఢీ ఇంట్రడక్షన్ ఇచ్చాడు నందు. ఆ తర్వాత స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఢీ పూర్తి చేసుకున్న సీజన్స్ లిస్ట్ ని చూపించారు. "ఈ స్టేజి మీదకు ఎంతో మంది కామన్ పీపుల్ గా వచ్చి పోటీ పది సెలబ్రిటీస్ అయ్యారు. కానీ మొదటి సారి ఈ స్టేజి మీద సెలబ్రిటీస్ పోటీ పడబోతున్నారు.. అదే ఈ సీజన్ ఢీ సెలెబ్రిటీ స్పెషల్" అని చెప్పాడు నందు. ఇక నందు యాంకర్ గా రాబోతున్నాడు అనిపిస్తోంది ఈ ప్రోమో చూస్తోంది. ఇక ప్రదీప్ కి బైబై చెప్పేసినట్టేనా మేకర్స్ అంటున్నారు నెటిజన్స్.
ఇక ప్రదీప్ యాంకర్ గా కనిపించకపోయేసరికి నెటిజన్స్ అంతా తెగ ఫీలైపోతున్నారు. సుధీర్ అన్న కానీ ప్రదీప్ అన్న కానీ ఉండాలి కామెడీ ఉంటుంది అని అంటుంటే ఇంకొందరు మాత్రం మార్పు మంచిదే బై బై ప్రదీప్ అన్న అంటున్నారు. ఇంకొందరు మాత్రం నందుకి అవకాశం ఇచ్చిన మల్లెమాలకు థ్యాంక్స్ అంటూ విషెస్ చెప్తున్నారు. ఐతే అసలే సెలబ్రిటీ స్పెషల్ కాబట్టి కంటెస్టెంట్స్ ఎవరూ అనే విషయం ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేదు...మరి ఈ సీజన ఎంత ధూమ్ ధామ్ గా ఎవరు లాంచ్ చేయబోతున్నారో చూడాలి.. ఇక నందు రీసెంట్ గా రిలీజయిన "వధువు" థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో తనదైన స్టైల్ తో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు.
![]() |
![]() |